ఓటు హక్కు పొందిన గవర్నర్‌ దంపతులు.. ఏపీలో ఎక్కడంటే..

By Newsmeter.Network  Published on  10 March 2020 10:36 AM GMT
ఓటు హక్కు పొందిన గవర్నర్‌ దంపతులు.. ఏపీలో ఎక్కడంటే..

ఏపీ గవర్నర్‌ హరించందన్‌ ఓటు హక్కు పొందారు. మంగళవారం తన సతీమణితో కలిసి రాజ్‌భవన్‌లో ఓటు నమోదు ప్రక్రియను పూర్తిచేశారు. ఎన్నికల విభాగపు డిప్యూటీ తహసీల్దార్‌ నాగమణి దగ్గరుండి ఓటు హక్కు నమోదును పూర్తిచేయించారు. గవర్నర్‌ దంపతులు విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఓటు హక్కును పొందారు. ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 2019లో ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన ఓటును విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి మార్చుకున్నారు. త్వరలో జిల్లా కలెక్టర్‌ గవర్నర్‌ దంపతులకు ఓటర్‌ కార్డును అందించనున్నారు. ఇదిలా ఉంటే ఈ నెలలో జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో గవర్నర్‌ దంపతులు విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2019కు ముందు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి నరసింహన్‌ గవర్నర్‌గా ఉన్నారు. ఎన్నికల తర్వాత కేంద్రం పలు రాష్ట్రాలకు గవర్నర్‌లను మార్చేసింది. ఈ క్రమంలోనే బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారు.

Next Story
Share it