బిగ్ బ్రేకింగ్ : రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలు బంద్

By రాణి  Published on  18 March 2020 12:06 PM GMT
బిగ్ బ్రేకింగ్ : రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలు బంద్

యావత్ దేశంలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా పెరుగుతున్న సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. విద్యా, వైద్య శాఖల ఉన్నతాధికారులతో సమీక్షానంతరం సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. గురువారం నుంచి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులకు సైతం ఎలాంటి స్పెషల్ క్లాసులు ఉండబోవని తెలుస్తోంది. కాగా..ఈ సెలవులు ఎప్పటి వరకూ కొనసాగుతాయన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. బహుశా తెలంగాణలో మాదిరిగానే..ఏపీలో కూడా మార్చి 31వరకూ ఈ సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటి వరకూ ఏపీలో ఒక్క కరోనా కేసే నమోదవ్వగా..తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. భారతదేశం మొత్తం మీద 150 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా..ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల్లో 255 మంది కరోనా ఉన్నట్లు నిర్థారణయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Next Story