మంత్రులకు ఏపీ ఆర్ధిక శాఖ షాక్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 5:57 PM GMT
మంత్రులకు ఏపీ ఆర్ధిక శాఖ షాక్..!

అమరావతి: ఏపీ మంత్రులకు పీఆర్‌వోల నియామకం మరింత ఆలస్యం కానుంది. పీఆర్‌వోల ఫైల్‌ను ఏపీ ఆర్ధిక శాఖ వెనక్కి పంపి మంత్రులకు షాక్ ఇచ్చింది. మూడు నెలల నుంచి తమ దగ్గరే పెండింగ్‌లో ఉంచుకుని...జీతాల కొర్రీ పేరుతో ఆర్దిక శాఖ ఫైల్ వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. మంత్రుల లైజనింగ్ ఆఫీసర్ల ఫైల్‌నూ పేర్ని నాని కి తిప్పి ఆర్దికశాఖాధికారులు తిప్పి పంపారు. ఇప్పటికీ పీఆర్‌వోలు లేక మంత్రులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. సీఎంవో సూచించిన వారినే మంత్రులుగా పెట్టుకోవాలని ఆదేశాలు రావడంతో మంత్రులు నిస్పృహలో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత మనుషులను పీఆర్‌వోలుగా పెట్టుకోవడానికి కమ్యూనికేషన్ అడ్వైజర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కమ్యూనికేషన్ అడ్వైసర్ చెప్పిన వారినే పెట్టుకోవడానికి మంత్రులు ఓకే చెప్పినా ఇప్పటికి కేటాయించక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. చేసిన పనులు కూడా ప్రజలకు చెప్పుకోలేకపోతున్నామని మంత్రులు గుసగుసలాడుకుంటున్నారు.

Next Story