ఏపీలో మరో రెండు కరోనా కేసులు..?

By సుభాష్  Published on  12 March 2020 11:38 AM GMT
ఏపీలో మరో రెండు కరోనా కేసులు..?

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్‌ ఇప్పటికే 4వేలకుపైగా మృతి చెందారు. మృతుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఈ వైరస్‌ ఇప్పటికే దాదాపు 200లకుపైగా దేశాలకు వ్యాపించింది. ఇక భారత్‌లోకి ప్రవేశించిన కరోనా.. తెలంగాణలో కూడా ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాగా, ఇప్పుడు తాజాగా ఏపీలో కూడా వ్యాపించింది. గత కొద్ది రోజులుగా తిరుపతిలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు పుకార్లు వ్యాపించగా, తర్వాత కరోనా లేదని ప్రకటించారు అధికారులు. తాజాగా నెల్లూరులో ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ఇరాన్‌ నుంచి ఏపీకి రావడంతో అతనికి ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇక ఇలాంటి సమయంలో మరో రెండు అనుమానిత కేసులు నమోదు కావడంతో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అలాగే అనకాపల్లిలో ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇద్దరిలో ఇటలీ నుంచి ఒకరు, సింగపూర్‌ నుంచి మరొకరు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీరిద్దరు అనుమానితులు కూడా విశాఖకు చెందిన వారుగా గుర్తించారు. వీరిని విశాఖలోని చెస్ట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అనుమానితులుగా ఉన్న వీరిద్దరిని రక్తనమూనాలను సేకరించారు. వీరిద్దరి రిపోర్టు వచ్చిన తర్వాత కరోనా ఉందా.. లేదా అనేది స్పష్టమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

Ap Coronavirus1

Next Story