కర్నూల్‌లో కరోనా కలకలం

By Newsmeter.Network  Published on  12 March 2020 3:26 AM GMT
కర్నూల్‌లో కరోనా కలకలం

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ భయపెడుతుంది. ఈ వైరస్‌ భారిన పడి ఇప్పటికే వేలాది మంది మృత్యువాత పడగా లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారత దేశంలోనూ ఈ వైరస్‌ భారిన పడిన వారి సంఖ్య 65కి పైగానే చేసింది. కాగా తెలుగు రాష్ట్రాలను ఈ వైరస్‌ భయపెడుతుంది. ఇప్పటికే ఈ వైరస్‌ వ్యాప్తిచెందకుండా రెండు రాష్ట్రాలు అనేక చర్యలు తీసుకున్నాయి. వ్యాధి లక్షణాలున్న అనుమానితులను ఐసోలేషన్‌ రూంలు ఏర్పాటు చేసి వాటిలో చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలో ఇటీవల రెండు అనుమానిత కేసులు నమోదైనప్పటికీ వారికి కరోనా వైరస్‌ సోకలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలో బుధవారం కరోనావైరస్‌ కలకలం సృష్టించింది. నెల్లూరు పట్టణానికి చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకిందని ప్రచారం జరిగింది. ఇతన్ని ఆస్పత్రిలో ఐసోలేషన్‌ రూంలో ఉంచి చికిత్స అందించారు. తొలుత ఆ వ్యక్తి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని ప్రచారం జరిగింది. కానీ అతని కరానో వైరస్‌ పాజిటివ్‌ అని నిర్దారణ కాలేదని వైద్యులు స్పష్టం చేశారు.

మరోవైపు కర్నూల్‌ జిల్లాలోనూ ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకిందనే వార్త కలకలం రేపుతోంది. కరోనా అనుమానంతో ఓ మహిళకు ఐసోలేషన్‌ వార్డులో చికిత్సఅందజేస్తున్నట్లు తెలిసింది. ఆ మహిళ ఇటీవలే జెరూసలేం యాత్రకు వెళ్లివచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అనుమానంతో ఆమెకు ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే శాంపిల్స్‌ను వైద్యులు తిరుపతికి పంపించినట్లు తెలుస్తోంది. శాంపిల్స్‌ రిజల్ట్ ఆధారంగా ఆమెకు కరోనా వైరస్‌ సోకింది లేనిది నిర్దారణ అవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

Next Story