ఏపీలో విజృంభిస్తోన్న కరోనా..ఆ రెండు జిల్లాల్లో కేసులు నిల్
By రాణి Published on 6 April 2020 7:07 PM ISTఏపీలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. సోమవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 37 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. అత్యధికంగా కర్నూల్ లో 18, నెల్లూరులో 8, పశ్చిమగోదావరిలో 5, కడపలో 4, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 303 కి పెరిగింది. వీటిలో 6 గురు కోలుకున్నారు. ఎక్కువగా ఢిల్లీ లింక్ కేసులే 280 ఉండటంతో వారు ఎవరెవరిని కలిశారన్నదానిపై అధికారులు దృష్టి సారించారు.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం..భయం గుప్పిట్లో ప్రజలు
ఇప్పటి వరకూ జిల్లాలవారీగా చూస్తే అత్యధికంగా కర్నూల్ లో 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు 42, గుంటూరు 32, కృష్ణా 29, కడప 27, ప్రకాశం 24, ప.గో 21, విశాఖ 20
చిత్తూరు 17, తూ.గో 11, అనంతపురం 6 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. కాగా..విశాఖలో 20 కరోనా కేసులుండగా ఆ జిల్లాకు దగ్గరగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇంత వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదు. ఆ రెండు జిల్లాలోని గ్రామస్తులు కొత్తగా ఎవరినీ గ్రామాల్లోకి రానివ్వడం లేదు. వైరస్ వ్యాపించకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
Also Read :భారత్ కు భారీ సహాయం ప్రకటించిన అగ్రరాజ్యం