ఏపీలో మరో 193 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2020 1:45 PM ISTఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,911 సాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా మరో 193 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5280 కి చేరింది. కొవిడ్ వల్ల చిత్తూరులో ఒక్కరు, కృష్ణాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ఈ మహమ్మారి వల్ల ఇప్పటి వరకు 88 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,851మంది డిశ్చార్జి కాగా.. 2341మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read
పేలిన బాయిలర్.. ముగ్గురికి తీవ్రగాయాలుNext Story