ఏపీలో కొత్తగా 304 కరోనా కేసులు

By సుభాష్  Published on  15 Jun 2020 9:08 AM GMT
ఏపీలో కొత్తగా 304 కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చుతుంది.రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 304 కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 246మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా, 52 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. ఇక విదేశాలకు చెందిన వారు 8 మంది ఉన్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. మృతులు కర్నూలు జిల్లాకు చెందిన వారు ఒకరు కాగా, అనంతపురం జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు.

ఇప్పటి వరకూ రాష్టర్లో 5087 కేసులు నమోదు కాగా, కరోనా నుంచి 2770 మంది కోలుకున్నారు. 2231 మంది యాక్టివ్‌గా ఉన్నారు. అలాగే ఇప్పటి వరకూ రాష్ట్రంలో మృతుల సంఖ్య 86కు చేరింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల ఆరోగ్యశాఖలు విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ను చూస్తుంటే గుండెల్లో దడ పుట్టించేలా ఉంది. ఇక తాజాగా తెలంగాణలో కూడా తీవ్రస్థాయిలో ఉంది.

గడిచిన 24 గంటల్లో 237 కేసుల నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 4974కు చేరింది. ఇలా తెలుగు రాష్ట్రాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో ప్రజల్లోమరింత ఆందోళన నెలకొంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్నో చర్యలు, జాగ్రత్తలు చేపట్టినా.. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు.Next Story
Share it