ఏపీలో కొత్తగా 1263 కరోనా కేసులు

By సుభాష్  Published on  6 July 2020 10:48 AM GMT
ఏపీలో కొత్తగా 1263 కరోనా కేసులు

ఏపీలో కరోనా తీవ్రతరం అవుతోంది. ప్రతి రోజువందల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16,712 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 1263 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది.

వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 56 మంది కాగా.. విదేశాల నుంచి వచ్చినవారు ముగ్గురున్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20019కి చేరింది. ఇక తాజాగా మరణించిన వారు శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపూర్‌లో ఒక్కరు, చిత్తూరు, గుంటూరు, కృష్ణ, విశాఖలో ఒకరు చొప్పున ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 239కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 8920 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 10860మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా

అనంతపూర్‌ : 142

చిత్తూరు : 120

గుంటూరు : 197

ఈస్ట్‌ గోదావరి : 171

కడప : 96

కృష్ణ : 55

కర్నూలు : 136

నెల్లూరు : 41

ప్రకాశం : 38

శ్రీకాకుళం : 36

విశాఖ : 101

విజయనగరం : 24

వెస్ట్‌ గోదావరి : 106Next Story
Share it