ఏపీ కరోనా హెల్త్ బులిటెన్: కొత్తగా 6,780 పాజిటివ్ కేసులు
By సుభాష్ Published on 17 Aug 2020 6:13 PM ISTఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తాగాజా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 6,780 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 296609 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక తాజాగా కరోనాతో మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది.
శ్రీకాకుళంలో 13, తూర్పుగోదావరిలో 10, చిత్తూరులో 8, గుంటూరులో 7, కడపలో 7, శ్రీకాకులంలో 6, పశ్చిమగోదావరిలో 6, అనంతపూర్‌లో 5, కర్నూలులో 5, విశాఖలో 5, విజయనగరంలో 5, కృష్ణలో 3, నెల్లూరులో 2 చొప్పున 82 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 2732కు చేరింది. ఇక మొత్తం కేసుల్లో 84,777 కేసులు యాక్టివ్‌లో ఉండగా, 209100 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్య శాఖ తెలిపింది. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 7,866 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 29,05,521 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.