స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం జగన్‌ సమీక్ష

By Newsmeter.Network  Published on  3 March 2020 11:41 AM GMT
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం జగన్‌ సమీక్ష

స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి సమీక్షించారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చామని సీఎం గుర్తు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యంను నియంత్రించాలనే ఆర్డినెస్సును తీసుకొచ్చామన్నారు. డబ్బు, మద్యం పంపిణీ రుజువైతే ఎన్నికల తర్వాత నిర్థారణ అయినా అనర్హత వేటు వేస్తామని, రెండు, మూడేళ్లు వారికి జైలు శిక్ష పడుతుందని చెప్పారు. జిల్లా ఎస్పీలు నగదు, మద్యాన్ని అరికట్టాలని, స్థానిక ఎన్నికలను పోలీస్‌ యంత్రాంగం ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల్లో ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి రూ.కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడం కాదని, గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసే వారినే.. ఎన్నుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎన్నిక ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలన్నారు. ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఉండే పోలీస్‌ మిత్రలు, సచివాలయాల్లో ఉండే మహిళా మిత్రలు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద ఈ యాప్‌ ఉండాలన్నారు.

Next Story