ఏపీలో టెన్త్ పరీక్షలు: ఏ రోజు ఏ పరీక్ష అంటే..
By సుభాష్ Published on 14 May 2020 12:59 PM GMTఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో విద్యాసంస్థలతో పాటు విద్యార్థుల పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో టెన్త్ పరీక్షలు కూడా వాయిదా వేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో పడిపోయారు. ఇక ఏపీలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండేది. ఎంతగానో ఎదురు చూసిన విద్యార్థులకు ఎట్టకేలకు గుడ్‌న్యూస్ తెలిపింది ఏపీ ఎస్ఎస్సీ బోర్డు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
జులై 10వ తేదీ నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది సర్కార్. ప్రతీ పేపర్‌కు వంద మార్కులు ఉంటాయని, 11 పేపర్లను 6 పేపర్లకు కుదించినట్లు ప్రకటించింది.
ఏ రోజు ఏ పరీక్ష..
జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్
11న సెకండ్ లాంగ్వేజ్
12న థర్డ్ లాంగ్వేజ్
13న గణితం
14 సామాన్య శాస్త్రం
15న సాంఘీక శాస్త్రం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతాయని ప్రకటించింది.