కథానాయిక చిత్రాలకు పెట్టింది పేరు అనుష్క. ‘భాగమతి’ సినిమా తరువాత రెండేళ్లు ఖాళీగా ఉన్న స్వీటీ తాజాగా నటించిన చిత్రం ‘నిశ్శబద్దం’. ఏప్రిల్‌ రెండున ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా సుమ యాంకరింగ్‌ చేస్తున్న ఓ షోకు హాజరైంది చిత్ర బృందం. ఈ సందర్భంగా అనుష్క.. హీరో ప్రభాస్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

టాలీవుడ్‌లో ప్రభాస్, అనుష్కల జోడీ ఒకరికోసం ఒకరు అన్నట్టుగానే ఉంటుంది. ఈ రెండు కటౌట్స్‌కి సింగిల్‌గా ఊహించుకుంటే జోడీ దొరకడం కాస్త కష్టమే. అంత హైట్, పర్శనాలిటీతో చూడముచ్చటగా కనువిందు చేయడం ప్రభాస్, అనుష్కలకు మాత్రమే చెల్లింది. అందుకే ఈ జంట రియల్ పెళ్లి బంధంతో ఒకటి కావాలని చాలామంది కోరుకుంటుంటారు.

సుమ హోస్ట్‌ చేస్తున్న షోలో కత్తి అందుకుని గిరగిరా తిప్పుతూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది అనుష్క. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో.. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చెప్తూ సుమ.. శానిటైజర్‌ను ఇచ్చి చేతులకు రాసుకోమని చెప్పడంతో చేతులకు శుభ్రం చేసుకుంది స్వీటీ. కార్యక్రమంలో భాగంగా ఒక ఫోటోను చూపించిన వెంటనే.. అతను.. నా కొడుకు అంటూ స్వీటీ చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది. ఇంతకూ సుమ చూపించిన ఫోటో.. ప్రభాస్ ది. అదేంటి? అంటూ సుమ అడిగితే.. అంతే.. నా కొడుకే కదా? అంటూ స్వీటీ ఆన్సర్ ఇవ్వటం సంచలనంగా మారింది.

హా.. మీ కొడుకు గురించే చెప్పండని సుమ అనడంతో.. ‘మనుషులు అంటే.. చాలా ఇష్టపడే వ్యక్తి అతను’ అని చెప్పడంతో.. ‘మీ ఇద్దరిలో ఒకే పోలికలు ఉన్నాయి కదా’.. అని సుమ అనగా.. ‘ నా కొడుకు కదండీ మరి నా పోలికలే ఉంటాయి’ అంటూ అంటూ గడుసరి ఆన్సర్ ఇచ్చి సుమ షాక్ అయ్యేలా చేసింది అనుష్క.

సరే మీ కొడుకు గురించి సరే.. అమరేంద్ర బాహుబలి గురించి చెప్పండి అంటే ‘అమరేంద్ర బాహుబలి క్వాలిటీసే వచ్చాయి ఈ కొడుక్కి’ అంటూ మరోసారి తెలివైన ఆన్సర్ ఇచ్చింది అనుష్క. మీరు ప్రభాస్‌తో ఫ్రెండ్ షిప్ మానేస్తారా? లేక సినిమాలు వదులు కుంటారా? అని ఆప్షన్ ఇస్తే ఏం చేస్తారని అనుష్కను అడగ్గా.. ఖచ్చితంగా సినిమాలైనా వదిలేస్తా కాని ప్రభాస్‌తో ఫ్రెండ్ షిప్ మాత్రం వదులుకోను అని తేల్చిచెప్పింది. ప్రస్తుతం అనుష్క మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.