అనుష్క‌.. హ్యాపీ బ‌ర్త్ డే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 9:21 AM GMT
అనుష్క‌.. హ్యాపీ బ‌ర్త్ డే..!

అందం, అభిన‌యం ఈ రెండు ఉన్న అతి కొద్ది మంది క‌థానాయిక‌ల్లో అనుష్క ఒక‌రు. టాలీవుడ్ కింగ్ నాగార్జున - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన స్టైలీష్ ఫిల్మ్ 'సూప‌ర్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బెంగుళూరు భామ‌. తొలి సినిమాతోనే విజ‌యం సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత స్టాలిన్ సినిమాలో చిరుతో క‌లిసి ఓ సాంగ్ లో స్టెప్పులు వేసి కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంది.

Anushka2

ఇక ఈ అమ్మ‌డు కెరీర్ లో మ‌ర‌చిపోలేని సినిమా అరుంధతి. ఈ సినిమా అనుష్క ద‌శ‌నే మార్చేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలంటే అనుష్క‌నే చేయాలి అనేంత గుర్తింపు సాధించింది. బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి... ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. కొంతకాలంగా క‌థానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ .. విజయాలను అందుకుంటూ వస్తోన్న అనుష్క‌ తాజా చిత్రం 'నిశ్శబ్దం'.

హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆమె ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకుంది. మైఖేల్ మ్యాడ్సన్ అనే విదేశీ నటుడితో పాటు, మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Anushka1

గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.అనుష్క పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిశ్శ‌బ్దం టీజ‌ర్ రిలీజ్ చేసారు. దీనికి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఆద్యంతం ఆకట్టుకునే సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ ఘటనలతో సాగిన ఈ టీజర్, సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి.. విభిన్న పాత్ర‌లు పోషిస్తూ కెరీర్ లో దూసుకెళుతోన్న బెంగుళూరు భామ అనుష్క‌.. హ్యాపీ బ‌ర్త్ డే & ఆల్ ది బెస్ట్.

Next Story
Share it