అనుష్క, ప్రభాస్ ప్రస్తుతం అక్కడున్నారు.. వైరలవుతోన్న పిక్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 5:28 AM GMT
అనుష్క, ప్రభాస్ ప్రస్తుతం అక్కడున్నారు.. వైరలవుతోన్న పిక్

బాహుబలి సినిమా తెలుగు సినీ చిత్ర సీమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. టాలీవుడ్ సినిమాలు వందకోట్లు కలెక్ట్ చేస్తే గొప్ప అనుకునే మనం.. రెండు వేలకోట్లను కొల్లగొడుతుందని కల్లో కూడా ఎవ్వరూ అనుకుని ఉండరు. కానీ దర్శకధీరుడు జక్కన ఆ కలను నిజం చేశాడు.

అయితే బాహుబలి సినిమాతో ఖ్యాతి పెంచిన రాజమౌళి.. టాలీవుడ్‌ రేంజ్‌ను పెంచి..భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించాలనుకునే దర్శకులు, నిర్మాతలకు కొండంత ధైర్యమిచ్చారు. బాహుబలి సినిమాలు వచ్చి మూడేళ్లు అవుతున్నా.. అవి నెలకొల్పిన రికార్డులను మరే చిత్రాలు కూడా బద్దలుకొట్టలేకపోతున్నాయి.

అయితే ఈ చిత్రంతో అమాంతం పెరిగిన ప్రభాస్, రాజమౌళి క్రేజ్ తెలుగు రాష్ట్రాల ఎల్లలు దాటి ఖండాలను దాటి అంతర్జాతీయ స్థాయి వరకు పెరిగింది. బాహుబలి తరువాత వీరి రేంజ్ మారడంతో.. వీరు చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌లపై అందరి దృష్టి నెలకొంది. అయితే బహుబలి టీం అంతా కలిసి మళ్లీ ఓ సారి లండన్‌ దేశంలో పర్యటిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో ఫోస్ట్‌ చేశారు.

Next Story
Share it