గుడ్‌న్యూస్: కరోనాపై ఆ మందు బాగా పనిచేస్తోందట..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 April 2020 7:25 AM GMT
గుడ్‌న్యూస్: కరోనాపై ఆ మందు బాగా పనిచేస్తోందట..!

ప్రముఖ ఫార్మా కంపెనీ గిలీడ్ సైన్సెస్ బుధవారం నాడు ఒక శుభవార్త తెలిపింది. తమ సంస్థ తయారు చేసిన మందులు కరోనా వైరస్ పేషెంట్లపై సమర్థవంతంగా పనిచేశాయని అన్నారు.

యాంటీ వైరస్ డ్రగ్ 'రెమ్డెసివిర్'(remdesivir) కరోనా రోగులపై మంచి ప్రభావం చూపించిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొందరు రోగులకు 5 రోజుల పాటూ రెమ్డెసివిర్ మందులు ఇవ్వగా వాళ్ళు చాలా స్పీడ్ గా రికవర్ అయ్యారని అన్నారు. ఎబోలా వైరస్‌ చికిత్సలో ప్రస్తుతం రెమ్డెసివిర్ ‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని అన్నారు. ఇలాంటి సమయంలో ఇటువంటి ఫలితాలు రావడం చాలా ఆనంద దాయకమని.. హెల్త్ కేర్ వర్కర్లకు ఎక్కువమంది పేషెంట్స్ ను ట్రీట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. గిలీడ్ కంపెనీ స్టాక్ దాదాపు 9 శాతం పెరిగింది.

ఆసుపత్రి పాలైన రోగులలో రెమ్డెసివిర్ మందులు వాడిన వాళ్ళు చాలా వేగంగా రికవర్ అయ్యారని ప్రాథమిక డేటా ద్వారా తెలిసింది. 1063 మంది రోగులపై ఈ రీసర్చ్ చేశారు. ఫిబ్రవరి 21న ఈ రీసర్చ్ మొదలైంది. అడాప్టివ్ కోవిద్-19 ట్రీట్మెంట్ ట్రయల్ ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్(NIAID) స్పాన్సర్ చేసింది. అమెరికాలో మొదలుపెట్టిన మొదటి క్లినికల్ ట్రయల్స్ ఇవే..!

ఇండిపెండెంట్ డేటా మరియు సేఫ్టీ మానిటరింగ్ బోర్డు.. ఏప్రిల్ 27 వరకూ ట్రయల్స్ ను పూర్తీ చేసింది. వారి విశ్లేషణను స్టడీ టీమ్ కు అందించింది. ఈ డేటా ప్రకారం ప్లాసిబో కంటే మెరుగ్గా 'రెమ్డెసివిర్' పనిచేసిందని కనుగొన్నారు. ప్రాథమిక ఫలితాలను పరిగణలోకి తీసుకోగా కోవిద్-19 వైరస్ బారిన పడిన వాళ్లకు రెమ్డెసివిర్ ఇవ్వగా 31శాతం వేగంగా కోలుకున్నారు. క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన రిజల్ట్స్ పై నిపుణుల సమీక్ష ముగిశాక మెడికల్ జర్నల్ లో పబ్లిష్ చేయనున్నారు.

ప్లాసిబో గ్రూప్ మందులను వాడిన వారు 15 రోజులు ఆసుపత్రుల్లో ఉండగా.. రెమ్డెసివిర్ ను వాడిన రోగులు 11 రోజుల్లో డిశ్ఛార్జ్ అయ్యారని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెడ్ డాక్టర్ ఆంటోనీ ఫాసీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్లేసిబో ఇచ్చిన వారి క‌న్నా రెమ్‌డెసివిర్ ఇచ్చిన వారిలో క‌రోనా వైర‌స్ త్వ‌ర‌గా నాశ‌నం అవుతుంద‌ని గుర్తించామన్నారు. ఈ మందు వలన చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

Next Story