రాష్ట్రంలో లంచాలు అనేది ఎక్కడ కనిపించకూడదనే ఉద్దేశంలో అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా అవినీతి జాడలు వెలుస్తూనే ఉన్నాయి. లంచాలకు కక్కుర్తిపడిన అధికారులు అవినీతి  మార్గంగా ఎంచుకుంటూ జనాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏపీలోని తిరువూరు మండలం వావిలాల గ్రామానికి చెందిన కొమ్మినేని చంద్రమౌళి అనే రైతు తనకు చెందిన నాలుగు ఎకరాల  భూమిని విడగొట్టి సాదా బైనమా, పట్టదారు కొరకు ఈనెల 6వ తేదీన గ్రామరెవెన్యూ అధికారి పోతురాజు  జయకృష్ణను కలిసి ఆర్జీని సమర్పించాడు. కాగా, ఈ నేపథ్యంలో రైతుకుసంబంధించిన ఈ పని పూర్తిచేయాలంటే తనకు రూ.20 వేల లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు సదరు రైతు పేర్కొన్నాడు.

తాను ఇంత మొత్తంలో డబ్బులు ఇవ్వలేనని చెప్పినా వినకపోవడంతో ఏసీబీ అధికారులను సంప్రదించాడు సదరు రైతు. ఈ రోజు సాయంత్రం వీఆర్వో తన నివాసంలో రూ.16వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రైతు వద్ద లంచం డిమాండ్‌ చేయడంతో తమ సిబ్బందితో కలిసి వీఆర్వోను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ  డీఎస్పీ కనకరాజు మీడియాకు తెలిపారు. కేసు నమోదు చేసి నగదుతోపాటు సదరు వీఆర్వోను రేపు కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.