తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం..దూసుకొస్తున్న 'క్యార్'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 11:37 AM GMT
తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం..దూసుకొస్తున్న క్యార్

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన మాంద్యం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని.. భారత వాతావరణ కేంద్రం అధికారులను అప్రమత్తం చేసింది. ఈ తుఫాను.. హరికేన్‌గా మారి ఒమన్ నుంచి భారత్‌ వైపు కదులుతోంది. ఈ తుఫానుకు 'క్యార్' అని నామకరణం చేశారు.

అయితే ఈ క్యార్‌ తుఫాన్‌ రానున్న 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చనుండడంతో..దీని ప్రభావం గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ, శాఖ తెలిపింది. దీంతో రానున్న 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో..తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ మేరకు మత్స్యకారులు వేటకు వెళ్లొందని వాతావరణ శాఖ సూచించింది.

అయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తిరువనంతపురంకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కొంకణ్, గోవా, కర్ణాటక ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం పుదుచ్చేరిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వి. నారాయణస్వామి చెప్పారు.

Next Story