ఉపాధిహామీకి మరో రూ. 40 వేల కోట్లు

By Newsmeter.Network  Published on  17 May 2020 8:12 AM GMT
ఉపాధిహామీకి మరో రూ. 40 వేల కోట్లు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో ఆదివారం చివరి విడత కేటాయింపులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఢిల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావశంలో ఆమె వివరించారు. ఈ కోవిడ్‌ సంక్షోభం నుంచి గట్టెక్కి భారత్‌ సమర్థదేశంగా ఆవిర్భవిస్తుందని అన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే ఆహారం అవసరం ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని గరీబ్‌ కల్యాణ్‌ యోజన ప్రారంభిచామన్నారు. మూడు నెలలకు సరిపడా ఆహార ధాన్యాలు అందిచామని చెప్పారు. వలస కూలీల తరలింపులో 85శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. శ్రామిక రైళ్లు వేసి వలస కార్మికులను తరలిస్తున్నామని, వారిని స్టేషన్లకు చేర్చే బాధ్యత తీసుకోవాలని రాష్ట్రాలను కోరుతున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Also Read :క్రిమినాశకాల పిచికారీతో కరోనా అంతంకాదు

ఇదిలాఉంటే పేదలకు ఉపయోగపడే ఉపాధిహామీ పథకానికి మరిన్ని నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి కల్పన మరింత పెంచేందుకు రూ. 40వేల కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వచ్చిన వారు తమత ప్రాంతాలకు వెళ్తున్నారని, ప్రస్తుతం తమ స్వస్థలాల్లో పనిలేకుండా ఇబ్బందులు పడకుండా ఉపాధిహామీ ద్వారా వారికి పని కల్పించనున్నట్లు తెలిపారు. ఇలా దేశవ్యాప్తంగా 300 కోట్ల పనిదినాలు కల్పించేందుకు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.

Next Story