ఢిల్లీ : ఢిల్లీలోని రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఆదివారం ఇదే భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్నిప్రమాదం జరిగి 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని, నరేంద్రమోదీ, కేజ్రీవాల్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.