రెండ్రోజులుగా భారతదేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకూ 40 మందికి కరోనా పాజిటివ్ రాగా..ఇటలీ నుంచి వచ్చిన 21 మందికి ఎయిమ్స్ వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. వారిలో 15 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. వీరందరినీ ఐసోలేషన్ వార్డులకు తరలంచి చికిత్స అందజేస్తున్నారు వైద్యులు. ఇప్పటికే ఎయిమ్స్ ఆస్పత్రిలోని బెడ్లు ఫుల్ అయిపోవడంతో..పెయిడ్ బెడ్స్ ను కూడా ఐసోలేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చేవారికి ఎన్ 95 మాస్క్ లను అందజేస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వ్యాప్తి చెందుతుండటం..ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్ లో నమోదైన కరోనా కేసు కూడా దుబాయ్ నుంచి వచ్చిందే. అక్కడికి పనిమీద వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వైరస్ ను వెంటబెట్టుకుని రావడంతో..అతడికి గాంధీలో చికిత్స నందిస్తున్నారు. కోనసీమలో కూడా ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. ఇంకా నిర్థారణవ్వలేదు.

మరోవైపు కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రమంత్రి హర్షవర్థన్ నేతృత్వంలో హైలెవల్ కమిటీ భేటీ అయింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.