నన్ను దారుణంగా రేప్ చేశాడు: హాలీవుడ్ నటి
By సుభాష్ Published on 24 Jan 2020 3:50 PM IST25 ఏళ్ల క్రితం తనను దారుణంగా రేప్ చేశారంటూ హాలీవుడ్ నటి అన్నాబెల్లా సియోరా కోర్టులో భావోద్వేగానికి గురయ్యారు. కోర్టు హాలులో తనపై జరిగిన దారుణాన్ని జడ్జి ఎదుట చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఈమెపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై గతంలో డైరెక్టర్ హార్వే వెయిన్‌స్టీన్‌పై కేసు నమోదైంది. కాని ఇప్పటి వరకు ఈ కేసులో సరైన ఆధారాలు లభించకపోవడంతో 25 ఏళ్ల పాటు విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా కోర్టులో బాదితురాలు వాదనలు వినిపించారు.
''1994లో సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లి ఇంటికి వెళ్లేందుకు ఆలస్యం అయినందున డైరెక్టర్ హార్వే వెయిన్ స్టీన్ కారులో దింపుతానని నన్ను ఎక్కించుకున్నాడు. న్యూయార్క్ లో మహట్టన్ అపార్డ్ మెంట్ దగ్గర దింపేసి వెళ్లిపోయాడు. తాను ఇంటికెళ్లి నిద్రించేందుకు సిద్ధమవుతుండగా డోర్ తలుపులు కొట్టినట్లు శబ్దం వినిపించింది. ఎవరో అనుకుని డోర్ తలుపులు తెరిచే సరికి హార్వే ఉన్నాడు. ఆయన్ను చూడగానే నాకు వణుకు పుట్టింది. మళ్లీ ఎందుకు వచ్చారని అడగగా, ఆలోపే నన్ను బలవంతం చేయబోయాడు. నేను ఇదేం పని అని ఎంత వారించినా వినకుండా బెడ్ రూంలోకి తీసుకెళ్లి మంచానికి కట్టేసి దారుణంగా రేప్ చేశాడు. నాకు ఆ రాత్రి కాళరాత్రిగానే మిగిలిపోయింది. జీవితంలో ఇదొక చేదు అనుభవంగా మిగిలిపోయింది'' అంటూ నటి అన్నాబెల్లా సియోరా కోర్టులో చెప్పుకొచ్చింది.
కాగా, ఈ వాదనలు వినిపించే సమయంలో హార్వే కోర్టు హాలులోనే ఉండటం గమనార్హం. ఇక నిందితుడు 80 మంది వరకు లైంగికంగా వేధించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అందులో హాలీవుడ్ హీరోయిన్ జోలీ పేరు కూడా ఉండటం విశేషం. నటి వాదనలతో ఎంత వరకు నిజాలున్నాయో తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్ వైద్యున్ని రప్పించాలని కోర్టు ఆదేశించింది.