మనుషులు రోజురోజుకు దిగజారిపోతున్నారు. మనుషుల మధ్య వావివరుసలు లేకుండా పోతున్నాయి. అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే.. ఇక్కడ మాత్రం రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లిపైనే అన్న అత్యాచారానికి ఒడిగట్టి సమాజం తలదించుకునేలా చేశాడు. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని ఉమ్రా పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల కథనం మేరకు.. ఓ చెత్తకుప్పలోఈనెల 15వ తేదీన ఓ శిశువు ఏడుపు వినిపించింది. దీంతో ఓ మహిళ అక్కడికి వెళ్లి చూడగా పసికందు కనిపించింది. దీంతో ఆమె శిశువును ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి, పాలు తాగించి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని శిశువును సంరక్షణా కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతుండగా, ఓ సంచలన  విషయం వెలుగులోకి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలిక గర్భం దాల్చడంతో శిశువును చెత్తకుప్పలో పడేసినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు బాలికను ప్రశ్నించగా షాకయ్యే నిజాలు బయటపడ్డాయి. అమాయకురాలైన మైనర్‌ బాలికను సొంత అన్ననే బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ కారణంగానే తాను గర్భం దాల్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో తన బండారం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో శిశువును తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేసినట్లు పోలీసుల ముందు తెలిపినట్లు తెలుస్తోంది. కాగా, బాలిక మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతోనే ఈ నీచుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

దర్యాప్తులు సంచలన నిజాలు బయటపడటంతో పోలీసులు సైతం షాకయ్యారు. సొంత చెల్లిపైనే సోదరుడు ఇలాంటి దారుణానికి పాల్పడటంతో, ఆ నీచున్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ విషయం బయటకు పొక్కితే కుటుంబ పరువు పోతుందన్న ఉద్దేశంతోనే గ్రామ పెద్దలు రహస్యంగా ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.