కుంబ్లే సెంచరీ.. వీవీఎస్ కిందపడి మరీ సంబరాలు
By తోట వంశీ కుమార్ Published on 5 Aug 2020 4:44 PM ISTటీమ్‌ఇండియా తరుపున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు అనిల్‌కుంబ్లే. బంతితో గింగిరాలు తిప్పి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను బోల్తా కొట్టిస్తాడు కుంబే. భారత్ తరుపున 132 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. తన టెస్టు క్రికెట్ చరిత్రలో బాదిన ఏకెక శతకం తనకు ఎంతో ప్రత్యేకమని భారత మాజీ కెప్టెన్ అన్నారు. టెస్టు క్రికెట్ లో ఫస్టు మ్యాచ్ నుంచే శతకం సాధించాలని ప్రయత్నించానని, అయితే.. 117వ టెస్టులో ఆ మార్కును అందుకున్నానని గుర్తుచేసుకున్నాడు జంబో.
టీమ్‌ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛాట్ ఫో డీఆర్‌ఎస్ విత్ యాష్‌లో జంబో చెప్పుకొచ్చాడు. నా తొలి మ్యాచ్‌లోనే శతకం చేయాలని ఎంతో ప్రయత్నించా.. ప్రయత్నిస్తూనే ఉన్నా.. చివరికి 117 మ్యాచ్‌లో ఆ కల నెరవేరింది. ఆ శతకం నాకెంతో ప్రత్యేకం. ఆ శతకం సాధించినప్పుడు నా కన్నా ఎక్కువగా బాల్కనీలోని నా సహచరులే ఎక్కువగా సంతోషించారు. వీవీఎస్ లక్ష్మణ్ అయితే కిందపడి మరీ సంబరాలు చేసుకున్నాడు, నేను డ్రెస్సింగ్ రూమ్ వెళ్లాక సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించారు అని కుంబ్లే చెప్పాడు.
'నిలదొక్కుకున్న చివరి బ్యాట్స్‌మన్ నేనేనని తెలుసు. మరోవైపు శ్రీశాంత్ ఉన్నాడు. అప్పటికే అతడితో కలిసి 30 పరుగులు చేశా. ఆ సమయంలో ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. నేనే పరుగులు చేయాలని, శ్రీశాంత్‌కి స్ట్రైక్ ఇవ్వొద్దని భావించా. కెవిన్ పీటర్సన్ బౌలింగ్‌లోనే సెంచరీ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నా. ముందుగానే క్రీజు బయటకు వచ్చా. అయితే పీటర్సన్ బంతి దూరంగా వేశాడు. బ్యాటు అంచుకు బంతి తాకిందని అర్థమైంది. వెంటనే పరుగు తీశా. అంపైర్ స్టీవ్ బక్నర్ దానికి బైస్ అని ఆలోచించేలోపే బ్యాటు పైకెత్తి గట్టిగా అరిచా' అని కుంబ్లే గుర్తుచేసుకున్నారు. 2007లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్లు మ్యాచ్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు. ఇక టీమిండియా తరుపున 132 టెస్లులు ఆడిన కుంబ్లే 619, 271 వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు.