బాలయ్య, సాయితేజ్ లకు షాక్ ఇచ్చిన కార్తీ
By Newsmeter.Network Published on 2 Dec 2019 12:30 PM IST
'ఖైదీ' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు 'దొంగ' గా రానున్నాడు. ఈ చిత్రంలో కార్తీకి వదిన, సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ పోస్టర్స్, టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
‘దొంగ’ నుండి ఫస్ట్ సింగిల్ వీడియోను విడుదల చేశారు. ‘రూపి రూపి’ అంటూ సాగే హుషారైన పాటని గోవా లో కలర్ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. లాంగ్ హెయిర్ తో, కొత్త తరహా స్టైలింగ్ తో కార్తీ సాంగ్ లో ఎనర్జిటిక్ గా ఉన్నారు.”… ఎవ్వరినీ వదలదుగా నా స్ట్రీట్ స్మార్ట్ చిలిపి తనం.. మాయలోన పుట్టి మాయలోన పెరిగినాను” అంటూ సాగే ఈ పాట హీరో క్యారెక్టరైజేషన్ ను తెలిపేలా సాగుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే... డిసెంబర్ 20న బాలయ్య 'రూలర్' , సాయితేజ్ ప్రతిరోజు పండగే చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు పోటీగా డిసెంబర్ 20న కార్తీ ‘దొంగ’అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఎనౌన్స్ చేసారు. దీంతో ఒక రకంగా బాలయ్య, సాయి తేజ్ లకు షాక్ ఇచ్చాడని చెప్పచ్చు. దీంతో డిసెంబర్ పోటీ మరింత ఆసక్తిగా మారింది. మరి.. బాక్సాఫీస్ వద్ద ఎవరు విన్నర్ గా నిలుస్తారో..? చూడాలి.