సీఎం వైఎస్ జగన్ పీఏ నారాయణ మృతి..!
By అంజి Published on 6 Dec 2019 3:06 PM ISTఅమరావతి: సీఎం వైఎస్ జగన్ పీఏ నారయణ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. నారయణ మృతి చెందిన విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఢిల్లీ పర్యటనను మధ్యలోనే వదిలేసి తిరుగు పయనమయ్యారు. ఈ రోజు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాల సీఎం జగన్ భేటీ కావాల్సి ఉంది. సీఎం జగన్ ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరనున్నారు. అక్కడి నుంచి అనంతపురం జిల్లాలోని నారయణ స్వగ్రామమైన దిగువపల్లెకు చేరుకోని.. నారయణ కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి సీఎం జగన్ హెలికాప్టర్ ద్వారా తాడేపల్లికి చేరుకున్నారు. వైఎస్సార్ కుటుంబంతో నారాయణకు 30 సంవత్సరాలకుపైగా అనుబంధం ఉంది.
Next Story