గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌.. తెలంగాణ హైకోర్టుకు బదిలీ

YS Viveka murder case prime accused bail petition transferred to TS High court. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్

By అంజి  Published on  16 Jan 2023 9:00 AM GMT
గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌.. తెలంగాణ హైకోర్టుకు బదిలీ

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. బెయిల్ రద్దు అంశాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ తదుపరి విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, గంగిరెడ్డి బెయిల్ రద్దుపై ఈ నెల 5న వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే.

గత విచారణ సందర్భంగా జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కేసు మెరిట్‌ల ఆధారంగా బెయిల్‌ను రద్దు చేయాలా వద్దా అనేది తేల్చాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో బెయిల్ మంజూరు చేసే సమయంలో మెరిట్‌ను పరిగణనలోకి తీసుకోలేదని, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయిన తర్వాత బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులోనే తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story