నేను హత్య మీద మాట్లాడితే.. YCP ఆస్తులు అంటుంది : వైఎస్ షర్మిల
విశాఖలో నేను ఆస్తుల గురించి మాట్లాడలేదు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పష్టం చేశారు. నేను మాట్లాడింది వివేకా హత్య మీద.. ఆస్తులు ఆస్తులు అని పదే పదే మాట్లాడింది YCP మాత్రమేనన్నారు.
By - Medi Samrat |
విశాఖలో నేను ఆస్తుల గురించి మాట్లాడలేదు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పష్టం చేశారు. నేను మాట్లాడింది వివేకా హత్య మీద.. ఆస్తులు ఆస్తులు అని పదే పదే మాట్లాడింది YCP మాత్రమేనన్నారు. ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజం అవుతుంది అని YCP భ్రమ పడుతుంది.. కానీ నిజం ఎప్పడు దాగదు అన్నారు. అబద్ధాన్ని నిజం అని చెప్పాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడు.. వివేకా హత్య ను అవినాష్ రెడ్డి తప్పుదారి పట్టించాడన్నారు. గుండెపోటు కట్టుకథ.. అవినాష్ సృష్టి.. ఇదే గుండెపోటు కట్టుకథను సునీత మీద నెట్టాలని చూశారని.. ఇదే నిజాన్ని నేను ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పాను.. నేను హత్య అంటే .. YCP ఆస్తులు అంటుంది.. వివేకా హత్య మీద సమాధానం చెప్పే దమ్ము YCP లేదని ఎద్దేవా చేశారు.
ఉదయం 7 గంటల నుంచి వివేకా గుండెపోటు అని సాక్షిలో ఎందుకు నడిపారు.. చెప్పలేదు.. నిజం ఏంటో చెప్పాల్సింది జగన్ , భారతి.. వీళ్ళు చెప్పలేక నా మీద అపనిందలు వేస్తున్నారన్నారు. నేను , సునీత చంద్రబాబుతో చెయ్యి కలిపాం అని సృష్టించారు.. నా పోరాటం ఆస్తులు కాదు.. నా ఆరాటంలో ఆస్తుల అంశం అజెండాగా లేదన్నారు.. ఆస్తులే నాకు ముఖ్యం అనుకుంటే నేను తెలంగాణలో పార్టీ పెట్టలేదు.. ఆస్తుల కోసం కోర్టుకి వెళ్ళింది నేను కాదు.. MOU ను నేను బహిర్గత పరచలేదు.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ గా మారాల్సిన అవసరం లేదు అన్నారు.
జగన్ లాగా నాకు స్వార్థ రాజకీయాలు నాకు తెలియదన్నారు. వేరే వాళ్ల ఆస్తులు అనుభవించాల్సిన దుస్థితి నాకు పట్టలేదన్నారు. నేను YSR ఆశయాలకోసం నడుస్తున్న వ్యక్తిని.. రాజకీయాల కోసం బీజేపీతో దత్త పుత్రుడుగా నేను మారలేదన్నారు. YS విజయమ్మ YSR భార్య.. YSR లో సగం విజయమ్మ.. లేఖ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది.. ఆస్తులు సగభాగం అని చెప్పింది.. నలుగురు మనుమలకు సమానంగా ఆస్తి పంపిణీ జరగాలని చెప్పింది.. ఇది YSR ఆదేశంగా కూడా విజయమ్మ లేఖలో పేర్కొంది.. నేను రాసింది దేవుడి సాక్షిగా నిజమే అని చెప్పింది.. ఆస్తుల విషయంలో గోబెల్స్ ప్రచారం చేయొద్దని చెప్పింది.. YCP లో సంస్కారం ఉన్న వాళ్లకు ఎవరికైనా అర్థం అవుతుంది.. అయినా కూడా మాట్లాడుతున్నారు అంటే కుక్కలు మొరుగుతున్నాయి అనుకుంటా అంతేనన్నారు.
విజయమ్మ లేఖను కూడా ఫేక్ అంటున్నారు.. లెటర్ మీద విజయమ్మ సంతకం పెట్టలేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. లేఖ నిజం కాకపోతే విజయమ్మ చెప్పేది కదా ? లేఖకు నాకు సంబంధం లేదు అని చెప్పేది కదా ? చెప్పలేదు అంటే లేఖ నిజమే కదా ? లేఖ అబద్ధం అయితే జగన్ సాక్షి రిపోర్టర్ ని పంపి విజయమ్మ బైట్ తీసుకొనే వాడు.. అలా చేయలేదు అంటే లేఖ నిజమే కదా ? లేఖ మీద జగన్ కి సమాధానం చెప్పే దమ్ములేక, కుక్కలతో మొరిగిస్తున్నాడు.. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు.. సాక్షిలో ఒక పక్క YSR ఫోటో.. సత్యమేవ జయతే అని పెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.