ఈవీఎంలు ధ్వంసం చేసిన వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలి: వైఎస్ షర్మిల

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు.

By Srikanth Gundamalla  Published on  13 May 2024 11:39 AM IST
ys sharmila, comments, andhra pradesh, election,

ఈవీఎంలు ధ్వంసం చేసిన వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలి: వైఎస్ షర్మిల

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఓటు అనేది ఒకపనిగా ఎవరూ చూడకూడదు అనీ.. ఓటుతోనే భవిష్యత్‌ను మార్చుకునే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ షర్మిల ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక కడప పార్లమెంట్‌ పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల కోరారు. ఏ ఒక్క పార్టీ వైపు ఎలక్షన్ కిషన్‌ పక్షపాతంగా నిర్ణయం తీసుకోకూడదంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈవీఎంలు ధ్వంసం చేసిన వైసీపీ అభ్యర్థిని ఎలక్షన్ కమిషన్ బహిష్కరించాలని ఈ మేరకు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

మరోవైపు ఎక్స్ వేదిగా పోలింగ్‌ సందర్భంగా వైఎస్ షర్మిల ఒక పోస్టు పెట్టారు. ఇందులో తన తండ్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర భవితను మార్చే ఎన్నికల పండుగ కొనసాగుతోందని ఆమె చెప్పారు. తన తండ్రి దివంగత రాజశేకర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన కడప నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం ఒక అపూరమైన అనుభూతిగా పేర్కొన్నారు. ఆయనని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ అమ్ఆనాన్న ఆశీస్సులు, దేవుడి దీవెన, ప్రజల ఆశీర్వాదం తనకు ఉన్నాయని నమ్ముతున్నానంటూ ఎక్స్‌ వేదిక పెట్టిన పోస్టులో వైఎస్ షర్మిల రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తన తండ్రితో దిగిన ఫొటోను వైఎస్ షర్మిల షేర్ చేశారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పాటు.. అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల జరుగుతోంది.


Next Story