అందుకే చేరానని ఇడుపులపాయ సాక్షిగా చెప్పేసిన షర్మిల

ఇడుపులపాయలో వైఎస్ షర్మిల

By Medi Samrat  Published on  20 Jan 2024 2:05 PM GMT
అందుకే చేరానని ఇడుపులపాయ సాక్షిగా చెప్పేసిన షర్మిల

ఏపీ పీసీసీ నూతన చీఫ్ వైఎస్ షర్మిల ఇడుపులపాయకు వచ్చారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ఇవాళ ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు అందుకోవడానికి వచ్చానని మీడియాకు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అన్నా ప్రాణంతో సమానమన్నారు. భారతదేశంలో ఇవాళ లౌకికవాదం అనే పదానికి, బహుజనవాదం అనే పదానికి అసలు అర్థమే లేకుండా పోయిందని.. రాజ్యాంగానికి అర్థమే లేకుండా పోయిందన్నారు. ఇలాంటివన్నీ మళ్లీ నెలకొనాలి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలన్నారు. భారతదేశానికి మంచి జరగాలి, వైఎస్సార్ ఆశయాలన్నీ సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నామని షర్మిల తెలిపారు.

వైఎస్సార్ కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేంతవరకు... నా పోరాటమే కాదు ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని షర్మిల తేల్చి చెప్పారు. మాజీ మంత్రి అహ్మదుల్లాను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అహ్మదుల్లాకు షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తదితరులు కూడా పాల్గొన్నారు.


Next Story