సింహాచలంలో ప్రత్యక్షమైన భయ్యా సన్నీ.. మిస్సింగ్ డ్రామాకు తెర

గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఆచూకీ లభ్యమైంది. దీంతో అతడి మిస్సింగ్ డ్రామాకు తెర పడింది.

By అంజి
Published on : 18 Jun 2025 8:42 AM IST

YouTuber Sunny Bayya, Simhachalam, NIA, Travel Vlogger

సింహాచలంలో ప్రత్యక్షమైన భయ్యా సన్నీ.. మిస్సింగ్ డ్రామాకు తెర

గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఆచూకీ లభ్యమైంది. దీంతో అతడి మిస్సింగ్ డ్రామాకు తెర పడింది. అతడు ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. నెల రోజుల కిందట చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి కనిపించకుండా పోయిన భయ్యా సన్నీ యాదవ్‌.. లేటెస్ట్‌గా "నేనొచ్చేశా" అంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. అంతకుముందు పాకిస్తాన్‌కు వెళ్లి వస్తుండగా చెన్నై ఎయిర్‌పోర్టులో సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందంటూ వార్తలు వచ్చాయి. గతంలో పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్.. ఆ దేశానికి గూఢచారిగా పని చేసినట్లు ఆరోపణలు రావటం తీవ్ర కలకలం రేపింది.

ఈ క్రమంలోనే అతడిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకొనని సీక్రెట్‌గా ఇన్వేస్టిగేషన్‌ చేస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపైఎలాంటి స్పష్టత లేకపోయింది. సన్నీ తండ్రి సైతం తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది. తాజాగానెల రోజుల తర్వాత విశాఖపట్నం చేరుకున్న సన్నీ భయ్యా.. సింహాచలంలో ఫోటోలు దిగి 'నేను వచ్చేసాను' అంటూ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఇంటికి వెళ్తున్నట్లు భయ్యా సన్నీయాదవ్‌ తెలిపారు. అయితే నెల రోజులపాటు సన్నీ యాదవ్‌ ఎక్కడికి వెళ్లారనేది తెలియాల్సి ఉంది.

Next Story