ఇద్ద‌రు యువ‌కులు బైక్‌‌పై వేగంగా వెలుతున్నారు. ఈ విష‌యాన్ని సివిల్ డ్రెస్‌లో ఉన్న ఓ ఎస్సై గ‌మ‌నించారు. వేగంగా వెళ్ల‌వ‌ద్ద‌ని యువ‌కుల‌ను వారించారు. అంతే.. స‌హ‌నం కోల్పోయిన ఆ ఇద్ద‌రు యువ‌కులు ఎస్సై పై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. శివన్నపేటలోని అత్తగారింటికి వెళ్లిన పాచిపెంట ఎస్సై రమణ.. సివిల్ డ్రెస్‌లో తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో ఖడ్గవలస వద్ద బైక్‌పై ఇద్ద‌రు యువ‌కులు వేగంగా వెళ్తున్నారు. వారిని అంత వేగంగా వెళ్ల‌వ‌ద్ద‌ని యువ‌కులను ఎస్సై వారించాడు. అయితే.. ఎస్సైపై యువ‌కులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో ఎస్సై ష‌ర్ట్ పూర్తిగా చిరిగిపోయింది. పోలీస్ అధికారిపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడి చేసిన వారిని చంద్ర‌శేఖ‌ర్‌, సుధాక‌ర్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పాచిపెంట పోలీస్ స్టేషన్‌కు త‌ర‌లించారు. వారికి గ‌తంలో నేర చ‌రిత్ర ఉన్న‌ట్ల‌యితే రౌడీషీట్ తెరుస్తామ‌న్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story