అనంతపురంలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి
Young Man died while dancing in Anantapur District.అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ మండపం వద్ద డ్యాన్స్
By తోట వంశీ కుమార్ Published on
12 Sep 2021 5:18 AM GMT

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుత్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గణేశ్ నవరాత్రులను పురస్కరించుకుని స్థానిక గౌతమిపురి కాలనీలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ యువకులు పాటలకు డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కుళ్లాయప్ప అనే యువకుడు కూడా స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశాడు.
అయితే.. అప్పటి వరకు హుషారుగా డ్యాన్స్ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కనున్న స్నేహితులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపారు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు గుండె పోటు రావడంతోనే అతడు మరణించి ఉండాడని అంటున్నారు. కాగా.. అప్పటి వరకు తమతో పాటే హుషారుగా గడిపిన స్నేహితుడు ఇక లేడనే విషయం తెలిసి మిగతా స్నేహితులు షాక్‌కు గురైయ్యారు.
Next Story