టీడీపీకి పురంధేశ్వరి అనధికార అధ్యక్షురాలు: విజయసాయిరెడ్డి
టీడీపీకి పురందేశ్వరి అనధికార అధ్యక్షురాలంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 2:59 PM ISTటీడీపీకి పురంధేశ్వరి అనధికార అధ్యక్షురాలు: విజయసాయిరెడ్డి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో.. విజయసాయిరెడ్డి తాజాగా స్పందించారు. పురందేశ్వరిపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి పురందేశ్వరి అనధికార అధ్యక్షురాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి అనధికార అధ్యక్షురాలిగా వ్యవహరించడం అనైతికమని అన్నారు విజయసాయిరెడ్డి. తండ్రిని అవమాన పర్చిన కాంగ్రెస్‌లో నిస్సుగ్గుగా ఆమె చేరారని.. కేంద్రమంత్రిగా కూడా ఉన్నారని చెప్పారు. ఏపీ విభజన సమయంలో శకుని పాత్ర పోషించి అన్యాయం చేశారంటూ పురందేశ్వరిపై సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
పురందేశ్వరి అవసరానికి తగినట్లుగా వ్యవహరిస్తారంటూ విమర్శిస్తూ.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఆమె బహు నేర్పరి అన్నారు. అధికారికంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూనే.. అనధికారికంగా టీడీపీకి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ఇది అనైతికం అన్నారు. ఆమె తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని.. ఆ అవమానాల పునాదులపైనే టీడీపీ ఏర్పాటు చేశారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అందే తండ్రిని అవమానించిన కాంగ్రెస్‌లో నిసిగ్గుగా చేరారంటూ పురందేశ్వరిపై విమర్శించారు విజయసాయిరెడ్డి. కేంద్ర మంత్రి పదవులు అనుభవించారని చెప్పారు. నీతిలేని చరిత్ర పురందేశ్వరిది అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను అవమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా పురందేశ్వరి తన పాత్ర వహించారని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు విజయసాయిరెడ్డి.
1/3: ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం.2/3: తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాదులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2023
శనివారం కూడా సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి ట్వీట్లు పెట్టారు.‘‘అమ్మా పురందేశ్వరి గారూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే... మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటుపొడిచే మీ రాజకీయమా?’’ అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
అమ్మా పురందేశ్వరి గారూ...తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే... మీది కుటుంబ రాజకీయమా? కుల…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 4, 2023