చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజాకు త‌ప్పిన ప్ర‌మాదం

YCP Chintalapudi MLA Eliza escape Car Accident.చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజాకు పెను ప్ర‌మాదం త‌ప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Dec 2022 9:46 AM IST
చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజాకు త‌ప్పిన ప్ర‌మాదం

చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజాకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఎమ్మెల్యే ప్ర‌యాణిస్తున్న కారు కామ‌వ‌ర‌పుకోట మండ‌లం అడ‌మిల్లి స‌మీపంలో అదుపుత‌ప్పి క‌రెంట్ పోల్‌ను ఢీ కొట్టింది. వెంట‌నే కారులోని ఎయిర్ బెలూన్లు తెర‌చుకోవ‌డంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఎమ్మెల్యే ఎలీజా, కుటుంబ స‌భ్యులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. వీరు హైద‌రాబాద్ నుంచి చింత‌ల‌పూడి వెలుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అనంత‌రం మ‌రొక కారులో జంగారెడ్డి గూడెం క్యాంప్ కార్యాల‌యానికి ఎమ్మెల్యే కుటుంబం చేరుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికీ ఏమీ కాక‌పోవ‌డంతో వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యే అభిమానులు అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

Next Story