తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ప్రధాని మోదీకి జగన్ లేఖ
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందనే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 4:50 PM ISTతిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందనే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంపైనే కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తిరుమల అడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై నిజాలు నిగ్గు తేల్చాలని లేఖలో కోరారు. లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయంటూ ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని జగన్ పేర్కొన్నారు. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారంటూ మోదీకి రాసిన లేఖలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు టీటీడీ ప్రతిష్టను దిగజార్చారంటూ జగన్ ఆరోపించారు. కొందరు నాయకులు టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని జగన్ లేఖలో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రదాని నరేంద్ర మోదీని కోరారు. శ్రీవారి లడ్డూ విషయంలో అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారనీ.. తిరుమల దేవస్థానం పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. శ్రీవారి లడ్డూ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని జగన్ పేర్కొన్నారు. ఏదైనా పొరపాటు జరిగిఉంటే విచారణ చేయించి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో జగన్.