హీటెక్కిన క‌డ‌ప రాజ‌కీయం.. విమలా రెడ్డి వ‌ర్సెస్ ష‌ర్మిల

ఎన్నిక‌ల వేళ వైఎస్ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతోంది. వైఎస్ వివేకా హ‌త్య విష‌య‌మై మేన‌త్త విమ‌లారెడ్డి, ష‌ర్మిలా రెడ్డి ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు చేసుకున్నారు

By Medi Samrat  Published on  13 April 2024 2:36 PM IST
హీటెక్కిన క‌డ‌ప రాజ‌కీయం.. విమలా రెడ్డి వ‌ర్సెస్ ష‌ర్మిల

ఎన్నిక‌ల వేళ వైఎస్ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతోంది. వైఎస్ వివేకా హ‌త్య విష‌య‌మై మేన‌త్త విమ‌లారెడ్డి, ష‌ర్మిలా రెడ్డి ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ప్రశాంతంగా ఉన్న పులివెందులలో షర్మిల, సునీత అల్లర్లు రేపుతున్నారని.. ఇకనైనా నోరు మూస్కోండని విమలా రెడ్డి అన్నారు. అవినాశ్ ఎదుగుదలను షర్మిల, సునీత ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిప‌డ్డారు. షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవని.. షర్మిల, సునీత వల్ల కుటుంబంలో అందరూ ఏడుస్తున్నారు.. కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని వ్యాఖ్యానించారు. వివేకాను ఎవరు చంపారో వీళ్లే డిసైడ్ చేస్తున్నారని విమల మండిపడ్డారు. హత్య అంశంలోకి జగన్ ను కూడా లాగుతున్నారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ విమలా రెడ్డి.. ష‌ర్మిల‌కు మేన‌త్త అవుతారు.

అయితే.. విమలా రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ష‌ర్మిల స్పందించారు. - విమలమ్మ మాకు మేనత్త.. మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదన్నారు. వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు.. CBI చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నామ‌న్నారు. ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది.. అందుకే మేము మాట్లాడుతున్నామ‌న్నారు. ఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం.. హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నామ‌న్నారు. విమలమ్మ కొడుకు కి జగన్ వర్క్స్ ఇచ్చారు.. ఆర్థికంగా బల పడ్డారు.. అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారని.. ఇక్కడ చనిపోయింది త‌న‌ సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలన్నారు. వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయిందన్నారు. విమలమ్మ కి వయసు మీద పడింది.. అందులో ఎండా కాలం..అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుందన్నారు.

Next Story