సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
Women Leaders Tie Rakhi to CM Jagan.రాఖీ పౌర్ణమి(రక్షాబంధన్) సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్ కి మహిళా
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2022 12:33 PM ISTరాఖీ పౌర్ణమి(రక్షాబంధన్) సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్ కి మహిళా నేతలు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు. హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమలు రాఖీలు కట్టిన వారిలో ఉన్నారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 11, 2022
ఇక వీరితో పాటు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస తదితరులు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. అనంతరం ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మౌంట్ అబూలో సెప్టెంబర్‌లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు సీఎంను బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ ఆత్మీయత, అనురాగాల పండుగ అని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరికీ దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.