చంద్రబాబు కాన్వాయ్‌ వెనుక పరుగు తీసిన మహిళ.. చివరకు..

విజయవాడలో ఎన్డీఏ పక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  11 Jun 2024 10:52 AM GMT
woman,  chandrababu, convoy,  vijayawada,

చంద్రబాబు కాన్వయ్‌ వెనుక పరుగు తీసిన మహిళ.. చివరకు.. 

విజయవాడలో ఎన్డీఏ పక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్.. ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. అయితే.. ఎన్డీఏ పక్షాల సమావేశం తర్వాత చంద్రబాబు ఉండవల్లికి పయనం అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కూటమి సమావేశం తర్వాత ఉండవల్లికి చంద్రబాబు కాన్వాయ్‌ బయల్దేరింది. ఇక అక్కడే ఉన్న ఒక మహిళ చంద్రబాబు కాన్వాయ్‌ని గుర్తించి.. దాని వెనకాల పరుగు తీసింది. ఆమెను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్‌ని ఆపించాడు. సెక్యూరిటీ గార్డులను వారించి మహిళతో మాట్లాడారు. ఆ తర్వాత ఆమెను దగ్గరకు పిలిపించుకుని ఆమె సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన పేరు నందిని అని సదురు మహిళ చంద్రబాబుతో చెప్పింది. చంద్రబాబుని చూసేందుకే తాను విజయవాడ వచ్చానని పేర్కొంది. మదనపల్లి ఉంచి విజయవాడ వచ్చినట్లు తెలిపింది.

ఈ మేరకు చంద్రబాబు విజయంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తమ కష్టం ఫలించిందని చెప్పారు. తమ కోరిక మేరకే సీఎం అయ్యారని అన్నది మహిళ. ఒక్కసారి పాదాభివందనం చేస్తానంటూ భావోద్వేగానికి గురైంది. ఇక చంద్రబాబు ఆమెను సున్నితంగా వారించి.. ఆప్యాయంగా మాట్లాడారు. మహిళకు జ్వరం ఉందన్న విషయం తెలుసుకుని.. ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యం బాగా చూసుకోవాలని సూచించారు. ఇక నందిని ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం అందించాలని పార్టీ నాయకులకు చందరబాబు సూచించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story