ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాల‌యం వ‌ద్ద ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. సీఎంనుక‌ల‌వాల‌ని పోలీసుల‌ను కోరుతూ త‌న వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మ‌హ‌త్యకు య‌త్నించింది. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా షాక్ తిన్న పోలీసులు వెంట‌నే తేరుకుని ఆ మ‌హిళ‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వివ‌రాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా చిట్ట‌మూరు మండ‌లం చిల్ల‌మూరు గ్రామానికి చెందిన నాగార్జున‌, భ‌వానీ దంప‌తులు త‌మ ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌ల‌వాల‌ని క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు.

నెల్లూరు జిల్లా దత్తలూరు తహసీల్దార్‌ తమను మోసం చేశారని ఆరోపించారు. నెల్లూరు నుంచి కుటుంబంతో సహా తాడేపల్లికి వచ్చిన నాగార్జున ఫ్యామిలీ.. సర్వీసు రోడ్డులో నుంచి సీఎం జగన్‌.. ఇంటికి వెళ్లే చెక్‌ పోస్ట్‌ వద్దకు చేరుకుంది. సీఎంను ఎలాగైనా కలవాలని పోలీసులను కోరుతూనే.. భవానీ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా.. సీఎం క్యాంపు కార్యాల‌య అధికారులు ఈ ఘ‌ట‌న‌పై ఆరా తీస్తున్నారు. ఆ మ‌హిళ కుటుంబానికి జ‌రిగిన అన్యాయం ఏమిట‌నే దానిపై విచారిస్తున్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story