దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్ వియాన్ ముల్దర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతను శాశ్వత కెప్టెన్ కానప్పటికీ, జింబాబ్వేపై అతను ఆడిన ఇన్నింగ్స్ చాలా రికార్డులను బద్దలు కొట్టింది. వియాన్ ముల్డర్ ట్రిపుల్ సెంచరీ బాది ఎన్నో రికార్డులు చెరిపేశాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా వియాన్ మల్డర్‌ను కెప్టెన్‌గా నియమించింది.
రెండో టెస్టులో వియాన్ అద్భుత ట్రిపుల్ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌గా ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ చాలా తక్కువ. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ముల్దర్ నిలిచాడు. అంతకుముందు 2012లో ఓవల్‌లో హషీమ్ ఆమ్లా ట్రిపుల్ సెంచరీ సాధించాడు.. కానీ అతను కెప్టెన్ కాదు. కెప్టెన్‌గా వియాన్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అలాగే దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మెన్‌గా మల్డర్ నిలిచాడు. హషీమ్ ఆమ్లా 311 పరుగులు చేశాడు, ఇప్పుడు ముల్డర్(367) అతని కంటే ముందున్నాడు.
వియాన్ ముల్డర్ రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. అయితే, భారత ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును తృటిలో మిస్సయ్యాడు. వీరేంద్ర సెహ్వాగ్ 2008లో దక్షిణాఫ్రికాపై కేవలం 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు.. వియాన్ ముల్డర్ జింబాబ్వేపై 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. 2024లో పాకిస్థాన్‌పై 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
వియాన్ ముల్డర్ కెప్టెన్సీ అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో కేశవ్ మహారాజ్ దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే అతను రెండవ మ్యాచ్‌కు ముందు గాయపడ్డాడు. దీంతో వియాన్ ముల్డర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ముల్డర్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కెప్టెన్ చేయలేని పనిని చేశాడు.