వివేకా హత్య కేసు నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు

Viveka murder case accused Gajjala Umashankar Reddy's wife threatened. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు

By Medi Samrat  Published on  5 March 2023 6:50 PM IST
వివేకా హత్య కేసు నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు

Gajjala Umashankar Reddy's wife


మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు ఎదురయ్యాయి. కసునూరు పరమేశ్వర్ రెడ్డి, ఆయన కొడుకు తమ ఇంటి వద్ద భయానక వాతావరణం సృష్టించారని, తన భర్తను చంపేస్తామని హెచ్చరించారని, చెప్పలేని విధంగా బూతులు తిట్టారని ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి మీడియా ముందు వాపోయారు. చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారని, తన ఫోన్ ను లాక్కుని కిందపడేశారని అన్నారు. కసునూరు పరమేశ్వర్ రెడ్డి మా ఇంటి వద్దకు వచ్చి వివేకాను చంపేసి ఇక్కడొచ్చి కూర్చున్నారా అంటూ బూతులు తిట్టాడని.. నీ భర్త ఇంటికి వచ్చాక, వివేకాను ఎలా చంపారో అతడ్ని కూడా అలాగే చంపుతామని హెచ్చరించారన్నారని అన్నారు. నిన్ను కూడా చంపుతాం, నిన్ను చంపితే ఇక్కడ దిక్కెవ్వరు? అంటూ నన్ను బెదిరించారని స్వాతి ఆసుపత్రిలో మీడియాతో చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఈ దాడిలో తనకు గాయాలు తగిలాయని, చికిత్స కోసం పులివెందుల ఆసుపత్రిలో చేరానని స్వాతి తెలిపారు.


Next Story