కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ, కడుపులో శిశువు ఎముకల గూడు

ఓ మహిళ తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చింది. మహిళ కడుపులో ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించి షాక్‌ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  3 Sep 2024 2:44 AM GMT
కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ, కడుపులో శిశువు ఎముకల గూడు

ఓ మహిళ తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చింది. ఆమెకువైద్య పరీక్షలు చేసిన విశాఖ కేజీహెచ్‌ వైద్యులు.. సదురు మహిళ కడుపులో ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించి షాక్‌ అయ్యారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి ఎముకలను బయటకు తీశారు.

అనకాల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఆమె మరోసారి గర్భం దాల్చడంతో.. ఆబార్షన్ కోసం ముందులు వాడింది. ఆ తర్వాత కొన్నాళ్లకే కడుపునొప్పి వేధించసాగింది. సాధారణ నొప్పిగా భావించిన ఆమె మొదట పట్టించుకోలేదు. చివరకు ఇటీవల కడుపునొప్పి ఎక్కువ కావడంతో విశాఖ కేజీహెచ్‌కు వచ్చింది. ఆగస్టు మూడో వారంలో కేజీహెచ్‌ ప్రసూతి విభాగ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఐ.వాణిని ఆమె సంప్రదించారు. బాధితురాలికి తొలుత అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ చేసి కడుపులో కణితి లాంటి దాన్ని గుర్తించారు. అనంతరం ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయగా 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు తేల్చారు వైద్యులు. అత్యంత అరుదుగా తలెత్తే ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘లితోపెడియన్‌’గా చెబుతారని వైద్యులు అన్నారు. దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు 25 కన్నా తక్కువ నమోదయ్యాయని చెప్పారు. అయితే.. సదురు మహిళకు ఆగస్టు 31వ తేదీనే ఆపరేషన్ నిర్వహించి.. కడుపులో ఉన్న శిశువు ఎముకల గూడును తొలగించారు. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. కొద్దిరోజులు ఆబ్జర్వేషన్‌లో ఉంచి.. ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని విశాక కేజీహెచ్‌ వైద్యులు చెప్పారు.

Next Story