Visakhapatnam: ప్రాణం తీసిన వేగం.. ఫ్లైఓవర్ పైనుంచి పడి ఇద్దరు మృతి
అతివేగంగా బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 12 May 2024 11:41 AM ISTVisakhapatnam: ప్రాణం తీసిన వేగం.. ఫ్లైఓవర్ పైనుంచి పడి ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఫ్లైఓవర్ ఖాళీగా ఉండటంతో అతివేగంగా వెళ్లారు. మలుపువద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నేరుగా వెళ్లి ఫ్లైఓవర్ రేలింగ్ వాల్‌ను ఢీకొట్టారు. దాంతో.. ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురు ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి కింద పడ్డారు. ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.
శనివారం రాత్రి విశాఖలోని ఎన్‌ఏడీ కొత్తరోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్యూక్ బైక్‌పై ముగ్గురు యువకులు అతివేగంగా ఫ్లైఓవర్‌పైకి వచ్చారు. ఇక కాస్త మలుపు ఉన్న చోటకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్లడంతో బైకు అదుపుతప్పి నేరుగా వెళ్లి ఫ్లైఓవర్ రేలింగ్ వాల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ముగ్గురూ ఎగిరి ఫ్లైఓవర్‌పై నుంచి ఎగిరి కింద రోడ్డుపై పడిపోయారు. దాంతో.. ఇద్దరు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన వ్యక్తిని కేజీహెచ్ కు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశామనీ ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించామన్నారు. కాగా.. ఈ రోడ్డుప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
విశాఖ: ఎన్‌ఏడీ కొత్తరోడ్డు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 12, 2024
బైక్‌పై వెళ్తూ రేలింగ్‌ను ఢీ కొట్టిన ముగ్గురు యువకులు
ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు..కేజీహెచ్‌కు తరలింపు pic.twitter.com/Ar84bTwjjW