రౌడీషీటర్ల కోసం జాబ్ మేళా.. విజయవాడ పోలీసుల వినూత్న ఆలోచన

Vijayawada police organized a job fair for a rowdy sheeter. రౌడీ షీటర్లు, రౌడీలు, గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచేందుకు రెగ్యులర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌తో పాటు,

By అంజి  Published on  6 March 2022 12:05 PM IST
రౌడీషీటర్ల కోసం జాబ్ మేళా.. విజయవాడ పోలీసుల వినూత్న ఆలోచన

రౌడీ షీటర్లు, రౌడీలు, గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచేందుకు రెగ్యులర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌తో పాటు, ప్రత్యామ్నాయ జీవనోపాధిని అందించడం ద్వారా వారిని సంస్కరించడానికి విజయవాడ నగర పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రైమ్‌తో భవిష్యత్తును కోల్పోయిన వారికి మంచి భవిష్యత్తు చూపేందుకు విజయవాడ నగర పోలీసులు ముందుకు వచ్చారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో మార్చి 5న షీట్ హోల్డర్ల కోసం బెజవాడ పోలీసులు జాబ్ మేళా నిర్వహించారు. నగర పోలీసు కమీషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ.. రౌడీషీటర్‌ల భవిష్యత్తును సరిదిద్దడానికి నిరంతరం కౌన్సెలింగ్ సెషన్‌లను నిర్వహిస్తున్నారని చెప్పారు. అయితే వారికి సహేతుకమైన ఉపాధి అవకాశం కల్పించకుండా, కౌన్సెలింగ్ సెషన్ ఎటువంటి ఫలితాలను ఇవ్వదు.

ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో చాలా మంది ముందుకు వచ్చారని తెలిపారు. రౌడీ షీటర్లు సరికొత్త జీవితాలను ప్రారంభించాలని సూచించారు. క్రైమ్ హిస్టరీ ఉన్నవారిలో సానుకూలమైన, స్థిరమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము ఆలోచించామని కాంతి రాణా చెప్పారు. "రౌడీ షీటర్ల విద్యార్హత, ఇతర నైపుణ్యాలను బట్టి నైపుణ్య శిక్షణ అందించడానికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అంగీకరించింది. దీంతో రౌడీ షీటర్లకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా దీర్ఘకాలంలో నేరాల రేటును తగ్గించడంలో కూడా సానుకూల ఫలితాలను ఇస్తుందని మేము ఆశిస్తున్నాము. వ్యాపారం ప్రారంభించాలనుకునే ఆసక్తి ఉన్న వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లతో కూడా మాట్లాడుతున్నామని కాంతి రాణా తెలిపారు.

Next Story