లిక్కర్ స్కామ్ కేసు: ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది.
By అంజి
లిక్కర్ స్కామ్ కేసు: ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్
అమరావతి: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు పోలీసులు. మద్యం పాలసీ రూపకల్ప, కుంభకోణంలో ఆయన కీలకమని సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లి పలు ఆధారాలు సమర్పించింది. మిథున్‌ను విచారించాల్సి ఉందని, రిమాండ్ కోరగా కోర్టు అందుకు అంగీకరించింది. మిథున్ రెడ్డి అరెస్ట్‌కు 29 కారణాలను సిట్ కోర్టుకు రిపోర్ట్ చేసింది. సెక్షన్ 409, 420, 120(బీ), రెడ్ విత్ 34, 37, ప్రివెన్షన్ ఆప్ కరెప్షన్ యాక్ట్ 7, 7ఏ, 8, 13 (1) (బీ), 13 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది.
ఏసీబీ కోర్టుకు సమర్పించిన వివరణాత్మక 28 పేజీల రిమాండ్ నివేదికలో.. మద్యం విధానాన్ని రూపొందించడంలో ప్రభుత్వ నియామకాలను ప్రభావితం చేయడంలో, నకిలీ కంపెనీలు, హవాలా లావాదేవీల ద్వారా అక్రమ డబ్బు ప్రవాహాన్ని నిర్వహించడంలో మిథున్ రెడ్డి ఎలా కీలక పాత్ర పోషించారో కోర్టుకు సిట్ వివరించింది. సిట్ ప్రకారం.. మిథున్ రెడ్డి వ్యక్తిగతంగా రూ.27 కోట్ల డబ్బును పర్యవేక్షించాడు. ఈ నిధులను గుర్తించకుండా ఉండటానికి షెల్ కంపెనీలు, హవాలా మార్గాల ద్వారా మళ్లించారు. ఈ డబ్బులో గణనీయమైన భాగం, రూ.15 కోట్లు, మిథున్ రెడ్డి కుటుంబంతో దగ్గరి సంబంధం ఉన్న PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేయబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీలు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఆర్థిక పత్రాలు, ఇతర డిజిటల్ ఆధారాల ద్వారా నిర్ధారించబడ్డాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) విధానాలను తారుమారు చేశారని నివేదిక పేర్కొంది.