ఏపిలో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ రగడ కొనసాగుతుంది. మొన్నటి వరకు పంచాయితీరాజ్ ఎన్నికల గోల కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఘట్టం పూర్తి కాకముందే ఇప్పుడు తెరపైకి స్టీల్ ప్లాంట్ రగడ మొదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వెనుక సీఎం జగన్ ఉన్నారంటూ టీడీపీ ఆరోపిస్తున్న వేళ.. కేంద్ర మంత్రి ప్రకటన వైఎస్సార్సీపీకి వరంలా మారింది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మొదలైందంటూ విజయసాయి రెడ్డి ఎదురు దాడికి దిగారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.


దీనిపై పార్టీలకు అతీతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయని అప్పుడు తనకేమి పట్టనట్లు ఉన్న చంద్రబాబు ఇప్పుడెందుకు రంకెలేస్తున్నాడని ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శించారు. కాగా, పోస్కో కంపెనీ ప్రతినిధులు, కొరియా రాయబారి 2018 అక్టోబర్ 22న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించినట్టు స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంటులో తెలిపారని.

ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రస్తావించిన సంగతిని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు దీనికి ఏదీ సంబంధం లేనట్టు తాను సచ్చీలుడని బాబు రంకెలు వేస్తూ రెండు కళ్ల సిద్ధాంతం జపిస్తున్నాడని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మండిపడ్డారు. ఇప్పటికైన చంద్రబాబు రెండు నాలుకల ధోరణిని మానుకోవాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీని రక్షించుకునేందకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందన్నారు.


సామ్రాట్

Next Story