ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ దాష్టీకానికి పాల్పడింది. తీసుకున్న రుణం చెల్లింపులు చేయకపోవడంతో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ రుణాల రికవరీ ఏజెంట్లు తమ మైనర్ కొడుకును కిడ్నాప్ చేశారని తల్లి తెలిపింది. బాలుడి తల్లి రాజేశ్వరి తీసుకున్న రూ.60 వేలు రుణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏజెంట్లు అరిగిపాలెం ప్రాంతంలోని తమ కార్యాలయంలో బాలుడిని బందీగా ఉంచారు.
బాలుడి తల్లి ప్రకారం.. ఏజెంట్లు మొదట తనపై దాడి చేసి, ఆపై తన కొడుకును కిడ్నాప్ చేశారని తెలిపింది. నిందితులు కుటుంబంలోని మహిళలను కూడా వేధించారని ఆమె పేర్కొంది. రికవరీ ఏజెంట్లు.. రామకృష్ణ, శివగా గుర్తించబడ్డారు. అయితే వారు బాలుడిని అతని తండ్రిని కనుగొనడానికి వారి కార్యాలయానికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.
మరోవైపు రికవరీ ఏజెంట్లకు కంపెనీతో సంబంధం లేదని పేర్కొంటూ సంస్థ మేనేజర్ రామారావు చేతులేత్తేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ ప్రకారం.. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కిడ్నాప్ (సెక్షన్లు 137-2), ఒక మహిళ యొక్క అణకువను అవమానించడం (సెక్షన్ 79-5) కింద కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేయబడింది.