సామాన్యుడి జేబుకు చిల్లు.. బ్లాక్‌లో వంటనూనెలు.. విజిలెన్స్ దాడులు

Vigilence officials raids on kirana shop and godowns in AP.రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో వినియోగ‌దారుల నుంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2022 9:12 AM GMT
సామాన్యుడి జేబుకు చిల్లు.. బ్లాక్‌లో వంటనూనెలు.. విజిలెన్స్ దాడులు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో వినియోగ‌దారుల నుంచి అందిన‌కాడికి దోచుకునేందుకు నూనె ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయ‌నే ప్ర‌చారానికి తెర‌లేపారు వ్యాపారులు. ఈ క్ర‌మంలో కృత్రిమ కొర‌త సృష్టిస్తూ.. ఎమ్మార్పీ ధ‌ర కంటే అధిక మొత్తానికి వంట నూనెను అమ్ముతున్నారు. నిన్న‌టి వ‌ర‌కు రూ.150లోపు ఉన్న స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్ ధ‌ర రూ.180కి అమ్ముతున్నారు. ఇంకొన్ని చోట్ల అంత‌కంటే ఎక్కువ‌కే విక్ర‌యిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వినియోగ‌దారుల‌ను దోచుకుంటున్న వ్యాపారులే ల‌క్ష్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు.

విశాఖ‌, తూర్పుగోదావ‌రి, కృష్ణా, గుంటూరు, నెల్లురు జిల్లాల్లో వంట నూనె దుకాణాలు, మిల్లులు, హోల్ సేల్ ఏజెన్సీలు, ప్రైవేట్ మార్టులు, గోదాముల‌పై విజిలెన్స్ అధికారులు ఆక‌స్మిక దాడులు నిర్వ‌హించారు. ప‌లు చోట్ల అక్ర‌మ‌నిల్వ‌లు ఉన్న‌ట్లు గురించారు. నూనె ప్యాకెట్లపై అధిక రేట్లతో స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నట్టు విజిలెన్స్ విచారణలో గుర్తించారు. తిరుపతిలో 9, చిత్తూరులో 4, పీలేరులో 2 దుకాణాల పై కేసులు నమోదు చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారుల్ని హెచ్చరించారు. వంటనూనెలు, నిత్యావసర సరుకుల్ని అధిక ధరకు విక్రయిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.

Next Story