శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Union home minister Amit Shah Srisailam tour.కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం శ్రీశైలం చేరుకున్నారు.
By తోట వంశీ కుమార్ Published on
12 Aug 2021 8:19 AM GMT

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం శ్రీశైలం చేరుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంట చేరుకున్నారు. అమిత్ షాకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, అధికారులు ఘన స్వాగతం పలికారు.
అమిత్ షా అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భ్రమరాంబ అతిథిగృహంలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story